
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దొనకొండలోని సెయింట్ ఆంటోనీస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నిర్వహించిన ప్రకాశం జిల్లా అండర్-19 ఓపెన్ & గర్ల్స్ చెస్ టోర్నమెంట్‌తో పాటు ప్రకాశం ఓపెన్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో సింగరాయకొండకు చెందిన చదరంగం క్రీడాకారుడు సయ్యద్ షఫీజ్ ప్రతిభ చాటాడు.ఈ పోటీలలో ప్రకాశం జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన షఫీజ్, జూన్ 27–28 తేదీల్లో అనకాపల్లిలో జరగనున్న స్టేట్ చెస్ టోర్నమెంట్‌కు అర్హత సాధించాడు. అలాగే మే 27న బాపట్లలో జరిగే స్టేట్ టీమ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో ప్రకాశం జిల్లా తరఫున పాల్గొనే అవకాశం పొందాడు.ఈ విజయంపై కోచ్ వంశీ కృష్ణతో పాటు పలువురు క్రీడా ప్రేమికులు షఫీజ్ను అభినందించారు.