
సామాజిక రాజకీయ దార్శనికుడు డా.బి.ఆర్ అంబేద్కర్
సమాజంలో అణగారిన వర్గాల హక్కుల సాధనకు, అంటరానితనం నిర్మూలనకు అంబేద్కర్ తన జీవితాంతం పోరాటం చేశారు
అంబేడ్కర్ ఆలోచన, ఆశయాలకనుగుణంగా సీఎం చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారు
మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
తొలి శుభోదయం ఒంగోలు :-
సమాజంలో అణగారిన వర్గాల హక్కుల సాధనకు, అంటరానితనం నిర్మూలనకు డా.బి. ఆర్ అంబేద్కర్ తన జీవితాంతం పోరాటం చేశారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజ నేయస్వామి అన్నారు. డా.బి. ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శనివారం నాడు మంత్రి డా.స్వామి మొదట ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు, అనంతరం ఒంగోలులో ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బి.ఎన్ విజయ్ కుమార్, కలెక్టర్ పి.రాజాబాబుతో కలసి అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…..సామాజిక రాజకీయ దార్శనికుడు డా.బి.ఆర్ అంబేద్కర్.అన్ని వర్గాల ప్రజల ఐక్యత, హక్కులకు నిదర్శనం అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం. సమాజంలో అణగారిన వర్గాల హక్కుల సాధనకు, అంటరానితనం నిర్మూలనకు అంబేద్కర్ జీవితాంతం పోరాటం చేశారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన కృషి ఎనలేనిది. నాడు విదేశీ విద్యకు పేరు మార్చి అంబేద్కర్ ని జగన్ అవమానించారు. అంబేడ్కర్ ఆలోచన, ఆశయాలకగుణంగా సీఎం చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారని, పేద ప్రజల సంక్షేమమే ద్వేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.
