
తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు , అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనే లక్ష్యంగా జిల్లా పోలీసులు అక్రమ పేకాట స్థావరాలపై దాడులు ముమ్మరం చేశారు. దీనిలో భాగంగా, ఒంగోలు గుంటూరు రోడ్డులోని సాయి లాడ్జి సమీపంలో అక్రమంగా పేకాట పై పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి రూ. 22,450/- నగదును స్వాధీనం చేసుకున్నారు.ఈ సందర్భంగా పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తును వేగవంతం చేశారు. జిల్లాలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు తావులేదని, జూదం మరియు పేకాట వంటి చర్యలకు పాల్పడే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసులు హెచ్చరించారు. ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో ఇటువంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు గమనిస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు లేదా డయల్ 112/100 ద్వారా సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.