
తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం పోలీస్:-
పామూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అనుమలకొండ ప్రాంతంలో గ్యాంబ్లింగ్‌పై ప్రత్యేక దాడి నిర్వహించారు. ఈ దాడిలో జూదం ఆడుతున్న 8 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.21,300 నగదు స్వాధీనం చేసుకున్నారు.అక్రమ గ్యాంబ్లింగ్ కార్యకలాపాలు సమాజంలో చెడు ప్రభావం చూపుతాయని, ఇటువంటి చట్టవ్యతిరేక చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని పోలీసులు హెచ్చరించారు. నిందితులపై చట్టపరమైన చర్యలు చేపట్టి, తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.ప్రజలు ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ఎక్కడైనా గ్యాంబ్లింగ్ లేదా ఇతర అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. సమాజంలో శాంతి భద్రతలను కాపాడేందుకు మార్కాపురం జిల్లా పోలీసులు కట్టుబడి ఉన్నారు.