
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరులోని కృషి విజ్ఞాన కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని నియోజకవర్గంలోని 31,853 మంది రైతులకు మొత్తం రూ.18.33 కోట్ల నిధులు విడుదల చేస్తూ మెగాచెక్కును అందజేశాను.మండలాల వారీగా రైతులకు విడుదలైన నిధులు: కందుకూరు మండలం – 7,745 మంది రైతులకు రూ.4.52 కోట్లు గుడ్లూరు మండలం – 6,632 మంది రైతులకు రూ.3.88 కోట్ల వలేటివారిపాలెం మండలం – 6,365 మంది రైతులకు రూ.3.68 కోట్లు లింగసముద్రం మండలం – 5,764 మంది రైతులకు రూ.3.28 కోట్లు ఉలవపాడు మండలం – 5,347 మంది రైతులకు రూ.2.96 కోట్లుఈ నిధుల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.12.74 కోట్లు, కేంద్ర ప్రభుత్వం రూ.5.58 కోట్లు కేటాయించాయి. రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తూ “అన్నదాత సుఖీభవ” పథకం ద్వారా ప్రతి రైతుకు ఏడాదికి రూ.20,000 అందించే సూపర్ సిక్స్ హామీని ప్రభుత్వం అమలు చేస్తోంది.కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మంజూరైన మినీ ట్రాక్టర్లను రైతులకు పంపిణీ చేయడంతో పాటు, హార్టికల్చర్ శాఖ ఏర్పాటు చేసిన ఆర్గానిక్ ఫుడ్ స్టాల్స్‌ను పరిశీలించాను. రైతులతో కలిసి పీఎం కిసాన్ నిధుల విడుదల కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంగా వీక్షించాం.రైతు సంక్షేమం కోసం కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు వ్యవసాయ రంగానికి మరింత బలాన్ని ఇస్తాయి. అన్నదాతలు సుభిక్షంగా ఉండాలని మా ప్రభుత్వ సంకల్పం.