
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు :-
కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారి పెద్ద కుమారుడు అవినాష్ పుట్టినరోజు వేడుకలను బుధవారం పట్టణంలోని అన్న క్యాంటీన్లో ఘనంగా నిర్వహించారు. కందుకూరు ప్రీమియర్ లీగ్ (KPL) కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో భాగంగా.. ముందుగా కమిటీ సభ్యులు, టీడీపీ నేతలు కలిసి కేక్ కట్ చేసి అవినాష్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అవినాష్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఉదయం పూట పేదలకు ఉచితంగా అల్పాహారం పంపిణీ చేశారు. అలాగే మధ్యాహ్నం, సాయంత్రం కూడా అన్నదాన కార్యక్రమం (అన్న సేవ) నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.