
తొలి శుభోదయం కందుకూరు:-
కందుకూరు పట్టణంలోని కోవూరురోడ్డులో, కొత్తగా ఏర్పాటుచేసిన హోటల్ అభిరుచి గ్రాండ్ ను శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ఆదివారం ఉదయం ప్రారంభించారు. ఎమ్మెల్యే తో పాటు మున్సిపల్ కమిషనర్ కే, అనుష జ్యోతి ప్రజ్వలన చేశారు. ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హోటల్ నిర్వాహకులు మర్రిపూడి శ్రీనివాసరావుకు ఎమ్మెల్యే నాగేశ్వరరావు ఆల్ ద బెస్ట్ చెప్పారు. కస్టమర్ల మనసు గెలుచుకునేలా వ్యాపారం నిర్వహించాలని సూచిస్తూ వ్యాపారం దినదినాభివృద్ధి చెంది మంచి పేరు తెచ్చుకోవాలని ఎమ్మెల్యే నాగేశ్వరరావు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, పార్టీ నాయకులు పిటికిటి వెంకటేశ్వర్లు, ఉప్పుటూరి శ్రీనివాసరావు, కండ్రా మాల్యాద్రి, చిలకపాటి మధుబాబు, బెజవాడ ప్రసాద్, గడ్డం మాలకొండయ్య, గుళ్ళా సుధాకర్ మరియు నాయకులు పాల్గొన్నారు.
