
తొలి శుభోదయం న్యూస్ అద్దంకి:-
ప్రకాశం జిల్లా, అద్దంకి నియోజకవర్గం, ఏల్చూరు గ్రామంలో పండుగ వాతావరణంలో 'ఎన్టీఆర్ భరోసా' పింఛన్ల పంపిణీ! రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ మరియు జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు స్వయంగా ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పింఛను నగదును అందజేశారు. సెలవు దినం ఉన్నా సరే, లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా ముందస్తుగానే పింఛన్లు పంపిణీ చేయడం రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం.