
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రకాశం జిల్లా వ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడంలో భాగంగా అద్దంకి మరియు చీమకుర్తి పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. అద్దంకి సీఐ పర్యవేక్షణలో గుర్రాల కాలనీలో జరుగుతున్న పేకాట స్థావరంపై దాడి చేసి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు, వారి వద్ద నుండి రూ. 4,000/- నగదును స్వాధీనం చేసుకున్నారు.మరోవైపు, చీమకుర్తి సీఐ ఆధ్వర్యంలోగడిపర్తివారిపాలెం గ్రామ శివార్లలో నిర్వహిస్తున్న కోడి పందాల శిబిరంపై దాడి జరిపారు. ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా, వారి వద్ద నుండి రూ. 7,000/- నగదుతో పాటు 2 పందెం కోళ్లు మరియు 2 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో జూదం, కోడి పందాలు వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.