
తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:-
కందుకూరు కు చెందిన గుంటూరు మాధవరావు, అను వ్యక్తి తొట్టెంపూడి రవీంద్ర అను అతనికి కొంత డబ్బులు అప్పుగా ఇచ్చినట్లు, సదరు డబ్బులు ఇవ్వమని తొట్టెంపూడి రవీంద్రను అడుగుతున్న అతను సరిగ్గా స్పందించడం లేదని, తన కుటుంబ అవసరాలు తీర్చలేక పోతున్నాని మనస్థాపంతో చనిపోవాలని ఈరోజు సాయంత్రం 04.30 గంటల సమయంలో చనిపోతున్నట్లు ఒక వీడియో పెట్టి చనిపోవుటకు ప్రయత్నిస్తున్నట్లు అతనే బంధువులకు ఫోన్ చేసి తెలపగా అంతట ప్రకాశం పోలీస్ కమాండ్ కంట్రోల్ నుంచి సమాచారం అందుకున్న సింగరాయకొండ సిఐ సిహెచ్ హజరత్తయ్య మరియు టంగుటూరు పోలీసులు అంతట వెంటనే స్పందించి అతని సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా టంగుటూరు పోలీసులు మరియు అతని బంధువులు చనిపోవుటకు ప్రయత్నించిన మాధవరావును ఆచూకీ గుర్తించి అతనికి కౌన్సిలింగ్ జరిపి వారి బంధువులకు అప్పగించడం జరిగినది.
అంతటి వారు ప్రకాశం జిల్లా యస్పీ వి. హర్షవర్ధన్ రాజు కి మరియు టంగుటూరు పోలీసులు తన్నీరు రమేష్ మరియు చంద్రశేఖర్ కు ధన్యవాదాలు తెలిపినారు.