
తొలి శుభోదయం కందుకూరు:-
పొగాకు బోర్డు కందుకూరు రెండవ వేలం కేంద్రం పరిధిలోని విశ్వనాథపురం గ్రామంలో పొగాకు లో పాటించ వలసిన ఉత్తమ యాజమాన్య పద్ధతులు పై సమగ్ర సస్య రక్షణ, ఎరువులు యాజమాన్యం, ఆకు రెలుపు, క్యూరింగ్, గ్రేడింగ్ మరియు పొగాకులో అన్య పదార్థాల నిర్మూలన వంటి అంశాలపై రైతులకు , సిబ్బంది కి శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వేలం నిర్వహణ అధికారి చంద్ర శేఖర్ మాట్లాడుతూ అడుగు ఆకులు వొదిలేసి పక్వానికి వచ్చిన వాటిని మాత్రమే రెలచాలి అని అన్నారు. ఆకు అల్లిక సమయం లో టార్పాలిన్ పట్టాలు విడిగా వాడాలి అన్నారు. గ్రేడింగ్ సమయం లో బుట్టలను అందు బాటులో ఉంచుకొని అన్యపదర్దాలను అందులో వేయాలని చెప్పారు. బారన్ లో కురోమీటర్ వాడాలని దీనివలన అగ్ని ప్రమాదాలను నివారించ వచ్చని తెలిపారు ఇంకా బ్యారెన్ లో క్యురింగ్ సమయం లో తీసుకోవలసిన మెలుకువలు, జాగ్రత్తలు గురించి తెలియజేశారు. అనంతరం పొగాకు తోటలు పరిశీలించారు. ఈ కార్యక్రమం లో సీనియర్ గ్రేడింగ్ ఆఫీసర్ రాజా గోపాల్ , ఐటీసీ మేనేజర్ విజయ్ కుమార్ GPI మేనేజర్ ఉన్నాం శ్రీనివాస్ , పోలిశెట్టి కంపెనీ ప్రతినిధి రామాంజనేయులు పొగాకు బోర్డు సిబ్బంది, మరియు రైతులు పాల్గొన్నారు..