
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
గత కొద్దిరోజులుగా క్రికెట్ బెట్టింగ్‌లపై ప్రత్యేక పోలీస్ బృందాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ గారు తెలిపారు. ఇటీవల దర్శి పోలీస్ స్టేషన్ పరిధిలో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. ఇంకా కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నామన్నారు.అలాగే, క్రికెట్ బెట్టింగ్‌లో పాల్గొంటున్న వారిని వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు.ఐపీఎల్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్ చట్టవిరుద్ధమని, ఇది వ్యక్తుల ఆర్థిక మరియు సామాజిక జీవితాలను దెబ్బతీస్తుందని జిల్లా ఎస్పీ గారు హెచ్చరించారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అవి మోసపూరితంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందని సూచించారు. క్రికెట్ బెట్టింగ్ కారణంగా అనేక కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని పేర్కొన్నారు.క్రికెట్ మ్యాచ్‌లను వినోదం కోసమే చూడాలని, బెట్టింగ్ వైపు మొగ్గు చూపకూడదని యువత, ప్రజలకు సూచించారు. ఎవరైనా క్రికెట్ బెట్టింగ్ పాల్పడేవారిపై ఏపీ జూద చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే స్థానిక పోలీసులకు, డయల్ 112కు లేదా పోలీస్ వాట్సాప్ నంబర్ 9121102266కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.