
తొలి శుభోదయం కందుకూరు:-
కందుకూరు నందు జరుగుతున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ ప్రాక్టికల్ సెంటర్లను పరిశీలించిన RIO టి వరప్రసాద్ రావు. శనివారం కందుకూరులో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతున్న పరీక్షా కేంద్రాలు టిఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్, కళాశాల వివేక జూనియర్ , కళాశాల ఆక్స్ఫర్డ్ మహిళా జూనియర్ కళాశాల, నాగార్జున జూనియర్ కళాశాల, గురుస్తాన్ జూనియర్ కళాశాల ,శ్రీ గాయత్రి జూనియర్ కళాశాలలను పరిశీలించి ప్రాక్టికలు జరుగు విధానం మీద సంతృప్తి వ్యక్తపరిచారు. ఆయా పరీక్ష కేంద్రాలలో విద్యార్థులు ప్రయోగాలు జరిగే విధానమును స్వయంగా అడిగి తెలుసుకున్నారు. పరీక్షా కేంద్రాల యొక్క చీఫ్ సూపర్డెంట్ లను ఇదే విధముగా జరగబోవు థియరీ పరీక్షలను కూడా విజయవంతంగా పూర్తి చేయాలని తెలిపారు. ఆర్ ఐ ఓ వరప్రసాద రావు మాట్లాడుతూ జిల్లాలో ప్రాక్టికల్ పరీక్షలను ఇంటర్మీడియట్ బోర్డు నియమ నిబంధనలను అనుసరించి నిర్వహిస్తున్నామని, ఎక్కడ నిర్లక్ష్యం తెలుత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని , అన్ని పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాలు ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నామని, అవసరమైన చోట ఆకస్మిక తనిఖీలు కొనసాగిస్తున్నామని నేను గాని మా జిల్లా పరీక్షల కమిటీ అన్ని జాగ్రత్తలు తీసుకొన్నామని తెలియజేశారు.