
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ నేపథ్యంలో ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.విద్యార్థులు ప్రశాంతమైన, భద్రమైన వాతావరణంలో పరీక్షలు రాయేందుకు అన్ని పరీక్షా కేంద్రాల పరిసరాల్లో పోలీసు సిబ్బందిని మోహరించారు. కేంద్రాల వద్ద నిరంతర పర్యవేక్షణ, అనుమానాస్పద వ్యక్తులపై నిఘా, ట్రాఫిక్ నియంత్రణ వంటి చర్యలు చేపట్టి పరీక్షల నిర్వహణ సజావుగా సాగేలా భద్రతా ఏర్పాట్లు చేశారు.పరీక్షల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలను కట్టడి చేస్తూ, విద్యార్థులు మరియు తల్లిదండ్రుల్లో భరోసా కలిగించే విధంగా పోలీసుల గస్తీ కొనసాగుతోంది. పరీక్షల నిర్వహణలో పోలీసు శాఖ పూర్తి సహకారం అందిస్తుందని అధికారులు తెలిపారు.