
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా, సజావుగా నిర్వహించాలనే లక్ష్యంతో ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు.పరీక్షల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో పోలీస్ అధికారులు, సిబ్బందిని నియమించారు. విద్యార్థులు భయం లేకుండా, ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయడానికి అనువుగా అన్ని భద్రతా చర్యలు చేపట్టారు. పరీక్షా కేంద్రాల వద్ద అనవసర గుంపులు ఏర్పడకుండా, ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.అదేవిధంగా పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 144 అమలు చేయడంతో పాటు, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్షా కేంద్రాల్లోకి తీసుకురాకుండా కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహిస్తున్నారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అంతరాయాలు కలగకుండా పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా విధులు నిర్వహిస్తోంది.ప్రజలు పరీక్షా కేంద్రాల వద్ద శాంతి భద్రతలకు భంగం కలగకుండా పోలీస్ శాఖకు సహకరించాలని, విద్యార్థులు తమ పరీక్షలపై పూర్తి దృష్టి పెట్టాలని పోలీస్ అధికారులు విజ్ఞప్తి చేశారు. పరీక్షలు పూర్తయ్యే వరకు బందోబస్తు కొనసాగుతుందని తెలిపారు.