
తొలి శుభోదయం సింగరాయకొండ:-
సింగరాయకొండ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ సన్నెబోయిన శ్రీనివాసులు చేతుల మీదుగా ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ (ఐఎల్ఏ) డైరీని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ, యువ న్యాయవాదులు వృత్తి పరంగా నైపుణ్యం, క్రమశిక్షణ, నైతిక విలువలు అలవరుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.ఈ డైరీ న్యాయవాదులకు వారి దైనందిన న్యాయపరమైన కార్యకలాపాలలో ఉపయోగకరంగా ఉండి, వృత్తి నిర్వహణకు దోహదపడుతుందని అన్నారు.కార్యక్రమంలో న్యాయవాదులు మోరుబోయిన వంశి,చిమటా కోదండపాణి,పఠాన్ రియాజ్ ఖాన్, గోనుగుంట శ్రీనివాసరావు మరియు ఐ ఎల్ ఏ,పంతగాని వెంకటేశ్వర్లు, పాల్గొన్నారు.