
తొలి శుభోదయం ఒంగోలు :-
ఈ నెల 2వ తేదీన సోమవారం ప్రకాశం జిల్లా అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక జిల్లా పోలీసు కార్యాలయం లో సోమవారం నిర్వహించనున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పి.జి.ఆర్.ఎస్.) కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. తెలిపారు. ఈ మేరకు జిల్లా ప్రజలు గమనించి రావద్దని సూచించారు.