
తొలి శుభోదయం కందుకూరు:-
కందుకూరులోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు. పెదకాకాని శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో వైద్యులు రోగులకు కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేస్తున్నారు. కంటి ఆపరేషన్లు అవసరమైన వారికి పెదకాకాని తీసుకువెళ్లి ఆపరేషన్లు చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఈ నేత్రవైద్య శిబిరానికి కందుకూరు నియోజవర్గంలోని అనేక గ్రామాల నుంచి వందల సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. అంతకుముందు సందీప్ పుట్టినరోజును పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన భారీ కేకును సందీప్ కట్ చేశారు. వివిధ వర్గాల ప్రజలు, నాయకులు, ప్రజలు సందీప్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఇంటూరి నాగేశ్వరరావు రిబ్బన్ కట్ చేసి నేత్ర వైద్య శిబిరాన్ని ప్రారంభించారు.
