
ప్రకాశం జిల్లా లో రెండవ సారి ఉత్తమ వైద్యాధికారి గుర్తింపు పట్ల పలువురు అభినందన.
తొలి శుభోదయం సింగరాయకొండ:-
ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు తో పాటు గా తీర ప్రాంతాల కేంద్రంగా పేదలకు ఉత్తమ వైద్య ఆరోగ్య సేవలు అందిస్తున్న ఉమ్మడి సింగరాయకొండ ఉన్నత శ్రేణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పాకల ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డా ఎన్ వంశీధర్ కి జిల్లా యంత్రాంగం నుండి ప్రశంశలు అభినందనలు అందాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో జిల్లా యంత్రాంగం నిర్వహించిన గణతంత్ర వేడుకలలో జిల్లా కలెక్టర్ రాజ బాబు చేతుల మీదుగా ప్రశంసాపత్రాన్ని అందజేశారు.ఈ సందర్బంగా సీనియర్ మెడికల్ ఆఫీసర్ డా.ధీరేంద్ర, వైద్య ఆరోగ్య సిబ్బంది అభినందనలు తెలిపారు.