
తొలి శుభోదయం ఉలవపాడు:-
జాతిపిత గాంధీజీ వర్ధంతి సందర్భంగా పేదలకు ఎంతగానో ఆసరాగా ఉన్న మహాత్మా గాంధీ జాతీయగ్రామీణ ఉపాధి హామీ పథకం పరిరక్షణ కోసం కృషి చేస్తామని ఉలవపాడులో ఉపాధి పని ప్రదేశంలో, కరేడు పంచాయతీ పెద్దపల్లి పాలెం లోని తుఫాను షెల్టర్ వద్ద వ్యవసాయ కూలీలు సిపిఎం ఆధ్వర్యంలో ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం ఉలవపాడు ప్రాంతీయ కమిటీ కార్యదర్శిజీవీబీ కుమార్ మాట్లాడుతూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లో గాంధీజీ పేరు లేకుండా తీసివేసిందని, బడ్జెట్ లో ఉపాధి హామీకి కేంద్ర ప్రభుత్వం40 శాతం నిధులను కోత విధించిందని. ఉపాధి హామీ పథకానికి విబి జి రామ్ జి అనే పేరు మార్చిందని పేర్కొన్నారు. ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడిచి నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. పాత పద్ధతిలోనే మహాత్మా గాంధీ జాతీయగ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని కోరారు. ఉపాధి హామీ పథకం 2005లో యూపీఏ ప్రభుత్వంలో వామపక్షాల ఒత్తిడితో వచ్చిందని తెలిపారు. ఈ పథకం వచ్చిన తర్వాత కూలీల ఆత్మస్థైర్యం పెరిగిందని అన్నారు. కూలి రేట్లు కూడా పెరిగాయని పేర్కొన్నారు. వలసల నివారణకు ఈ పథకం తోడ్పడిందని పేర్కొన్నారు. కూలీలకు ఎంతగానో ఆసరాగా ఉన్న ఈ పథకాన్ని నిర్వీర్యం చేయడం తగదన్నారు. కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేసి ఈ పథకాన్ని యధావిధిగా పునరుద్ధరించాలని కోరారు. లేనట్లయితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం ఉలవపాడు మండల సహాయ కార్యదర్శి గొల్ల పోతు శివకుమార్,పీతా. శ్రీను,నాయుడు. వెంకటేశ్వర్లు, కొక్కిలగడ్డ వెంకట్రావు, ఉపాధి మేట్ సర్వేపల్లి శ్రావణి, ఉపాధి కూలీలు నెల్లూరి రంగయ్య, చందలూరి కొండయ్య,కాకు టూరి.శ్రీను, ఎన్ లక్ష్మమ్మ, కే శ్రావణి, కండ్లగుంట వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు
