
తొలి శుభోదయం న్యూస్ టంగుటూరు:-
టంగుటూరు మండలం జయవరం గ్రామపంచాయతీ నందు ఏపీవో ఎస్. మాచర్ల ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో రాబోయే నెలలో వికసిత్ భారత్ గ్రామీణ్ రోజ్గార్ మరియు అజీవిక మిషన్ గ్రామీణ్ కు సంబంధించి ఉపాధి శ్రామికులతో పని ప్రదేశమునందు పథకం పై అవగాహన మరియు వారి చేత ప్రతిజ్ఞ చేయించటం జరిగింది దీనిలో భాగంగా E-KYC పై అవగాహన కల్పించి 2026-27 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా వచ్చిన మార్పులో భాగంగా 100 రోజుల పనిని 125 రోజులకు పెంచడం జరిగిందని తెలియజేయడం జరిగింది అంతేకాకుండా క్రొత్త జాబ్ కార్డ్ తీసుకునేవారు తప్పనిసరిగా E-KYC ని ఫీల్డ్ అసిస్టెంట్ ద్వారా చేయించుకోవలెను లేనిచో మస్టర్ నందు మీ పేరు నమోదు కాదని తెలపడం జరిగింది