
తొలి శుభోదయం సింగరాయకొండ:-
క్రీడా స్ఫూర్తితో ప్రభుత్వం యొక్క ఉన్నతమైన ఆలోచనలకు మద్దతు అందించిన దాతల సహకారం అభినందనీయం అని నిర్వాహకులు మండల విద్యాశాఖ అధికారి కత్తి శ్రీనివాసులు తెలిపారు.
టోర్నమెంట్ నిర్వహణకు అవసరమైన క్రీడా సామగ్రి, హెల్మెట్లు, బ్యాట్లు,గ్లౌజులు, వికెట్లు మొదలైన క్రికెట్ సామాగ్రి మరియు మహిళా ఉపాధ్యాయినిలకు త్రోబాల్ ఇతర ఆట వస్తువులు, బహుమతులు వంటి సౌకర్యాలను అందించడంలో దాతలు చూపించిన ఉదారత ప్రశంసనీయమని సమావేశంలో పేర్కొన్నారు. ఉపాధ్యాయుల సంక్షేమం కోసం సమాజం ముందుకు రావడం ఒక మంచి సంకేతమని నిర్వాహకులు తెలిపారు.ప్రధాన అతిథులుగా హాజరైన మించల బ్రహ్మయ్య,మాలేపాటి ప్రభాకర్ రెడ్డి,వాకా రమణారెడ్డి,కూనపు రెడ్డి సుబ్బారావు,ఎల్. శ్రీనివాసులు,కేశవరపు జాలి రెడ్డి,గోనుగుంట నరసింహారావు,గీతం స్కూల్ కరెస్పాండెంట్ లక్ష్మణ్ మొదలైన దాతలకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఉపాధ్యాయుల క్రీడా కార్యక్రమాలకు ఇదే విధంగా సహకారం కొనసాగించాలని కోరారు. క్రీడలు ఉపాధ్యాయులలో టీమ్ స్పిరిట్, నాయకత్వం మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని వారు అన్నారు.ఈ కార్యక్రమం మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగింది. ఉపాధ్యాయుల ఉత్సాహభరితమైన పాల్గొనడం మరియు దాతల సహకారం వల్ల ఈ టోర్నమెంట్ మరింత ఆకర్షణీయంగా మారిందని నిర్వాహకులు తెలిపారు.
కార్యక్రమంలో ఉపాధ్యాయులు అర్రిబోయిన రాంబాబు, జలగం ప్రభాకర్, అంబటి బ్రహ్మయ్య,బీశాబత్తిన శ్రీనివాసులు,పఠాన్ మస్తాన్,నూకసాని వెంకటేశ్వర్లు,కీర్తి శ్రీనివాస్, యాకోబు,పిడిలు మాల్యాద్రి, అన్వర్ మరియు ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
