
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
ఒంగోలులోని ప్రముఖ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉపాస్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో కందుకూరు వాసవి నగర్ నందు గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరం నందు ప్రముఖ మోకాళ్ళ మార్పిడి వైద్య నిపుణులు డాక్టర్ ప్రకాష్ చవల, ప్రముఖ ఇంటర్వెషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ మార్తాండం వెంకటేష్, ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ ఎన్ పవన్ కుమార్ డాక్టర్లు ఉచిత వైద్య శిబిరంలో రోగులను పరీక్షించారు. వారికి బీపీ, షుగర్, ఈసీసీ పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా ఉపవాస హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్ చవల మాట్లాడుతూ ఉపాస్ హాస్పిటల్ కేవలం వ్యాపార దృక్పథంతోనే కాకుండా సమాజానికి తమ వంతు సేవలు అందించాలనే దృక్పథంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు కందుకూరు పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామని తెలిపారు.