
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు ఉపాస్ మరియు ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించిన చలివేంద్రాన్ని ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారు , పిడిసిసి బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య ప్రారంభించారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని
ప్రయాణికుల మరియు బాటసారుల దాహార్తిని తీర్చేందుకు చర్చి సెంటర్లోని బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ప్రాంగణంలో ఈ చలివేంద్రాన్ని పెట్టడం జరిగిందని , ఒకే రోజు దాదాపు 1500 మంది మంచినీరు త్రాగే విధంగా సామర్థ్యం కలిగిన వసతిని ఏర్పాటు చేశామని, అలాగే 500 మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేయడం జరిగిందని ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఉమాపతి చౌదరి గారు తెలియజేశారు.
మండుతున్న ఎండలకు ప్రజల యొక్క దాహార్తి తీర్చడానికి ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారు ఈ మినరల్ వాటర్ చలివేంద్రాన్ని నిర్మించడం చాలా ఆనందదాయక విషయమని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ గారు తెలియజేశారు. ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విరివిగా వైద్య శిబిరాలు, చలివేంద్రాలు నిర్వహిస్తూ పేద మరియు మధ్యతరగతి ప్రజలకు తన వంతుగా సామాజిక సేవ చేస్తున్నారని ఈ సందర్భంగా ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు జాగ్రత్తగా ఉండాలి అని, శరీరం డిహైడ్రేషన్ అవ్వకుండా తరచుగా నీరు, మజ్జిగ, కొబ్బరినీళ్లు , నిమ్మరసం తీసుకోవాలి అని సూపర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్ చవల గారు తెలియజేశారు. ఇంటిలోనే ఓఆర్ఎస్ ద్రావణం తయారీ విధానాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అని తెలియజేశారు.
ఇంటి నుండి బయటకు వచ్చే సమయంలో తేలికపాటి కాటన్ దుస్తులు ధరించి, ఎండ దెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు పాటించాలని ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ కాపా అనిల్ కుమార్ గారు తెలియజేశారు. వడదెబ్బకు గురైనప్పుడు శరీరంలోని లవణాలు తగ్గి నిర్జలీకరణ స్థితి ఏర్పడి నీరసం, తలనొప్పి, వాంతులు, మూత్రం గాఢ పసుపు రంగులో ఉండటం వంటి లక్షణాలు ఏర్పడి పాక్షికంగా లేదా పూర్తిగా అపస్మారక స్థితిలో వెళ్లే అవకాశం ఉందని ఉపాస్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ పోకూరి శ్రీనివాస్ గారు తెలియజేశారు. కాబట్టి ప్రజలు ఎండలో తిరిగేటప్పుడు తగు జాగ్రత్తలు వహించాలని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఉపాస్ డాక్టర్లు డాక్టర్ ఎన్ .పవన్ కుమార్ గారు, డాక్టర్ రాధా గారు, డాక్టర్ పవన్ గారు, డాక్టర్ అల్లాడి సాత్విక్ గారు, డాక్టర్ లీనా గారు, జనరల్ మేనేజర్ ఆనంద్ , మార్కెటింగ్ మేనేజర్ షేక్ ఖాసిం సైదా, లైన్స్ క్లబ్ సభ్యులు నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు గారు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు