
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
ఉమ్మడి జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలు నియంత్రణలో భాగంగా టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ యు. సుధాకర్ ఆధ్వర్యంలో ఎస్సై సుదర్శన్, ఏఎస్ఐ మహబూబ్ బాషా మరియు పోలీసు సిబ్బంది కనిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని గుడిపాడు గ్రామ అవుట్స్కర్ట్స్ ప్రాంతంలో జూదం నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు ఆకస్మిక దాడులు (సర్ప్రైజ్ రైడ్) నిర్వహించారు. డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసి అసాంఘిక కార్యకలాపాలను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.ఈ దాడిలో జూదం ఆడుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుండి ₹2,300 నగదు, 2 మొబైల్ ఫోన్లు మరియు 2 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.అక్రమ జూదం మరియు ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రకాశం జిల్లా పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని, ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో జరిగే అనుమానాస్పద లేదా అసాంఘిక కార్యకలాపాల గురించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.