
తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు:-
పగలగొట్టిన పైపులైను వెంటనే పునరుద్దరించి రామకృష్ణాపురం గ్రామ ప్రజలకు త్రాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలని మాజీ శాసనసభ్యులు కందుకూరు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఇన్చార్జి బుర్రా మధు సూధన్ యాదవ్ ఒక ప్రకటనలో తెలియపరిచారు బిపిసిల్ సిబ్బంది తమ పనుల కోసం కరేడు నుండి రామకృష్ణాపురం కు వెళ్ళే త్రాగునీటి పైపులైను ద్వసం చేశారు. దీనివలన రామకృష్ణాపురం ప్రజలు గత పది రోజుల నుండి త్రాగునీటికి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై పంచాయితీలో ఫిర్యాదు చేసినా వారు ఇంతవరకు బిపిసియల్ సిబ్బిందిపై చర్యలు తీసుకోలేదు. వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకొని పైపులైను వెంటనె పునరుద్దరించాలని బుర్రా మధు సూధన్ యాదవ్ తెలియపరిచారు.