
తొలి శుభోదయం న్యూస్ ఉలవపాడు:-
స్వతంత్ర సమరయోధులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారతదేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి 119 వ జయంతి ఉలవపాడు మండలం లో MRPS, MSP, MEF మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మహాజన సోషలిస్ట్ పార్టీ కందుకూరు నియోజకవర్గ ఇన్చార్జి రావినూతల ముత్తు మాదిగ అధ్యక్షత వహించారు ముఖ్య అతిథి MEF రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి బిక్షాలు మాదిగ గారు మాట్లాడుతూ దళితుల పట్ల కులవ్యక్షత అంటరానితనం వెంటాడుతున్న ఈ భారత దేశంలో బాబు జగ్జీవన్ రామ్ గారి బాల్యం నుండి అనేక అవమానాల మధ్య తమ విద్యాభ్యాసాలు సాగాయని తన దృఢ సంకల్పంతో అన్ని అవరోధాలను ఛేదించుకుంటూ దీర్ఘకాలిక కేంద్ర మంత్రిగా వివిధ శాఖలకు మరియు భారతదేశ ఉప ప్రధానిగా ఈ దేశానికి సేవలందించారని SC రిజర్వేషన్లను కాపాడడంలో క్రియాశీలక భూమిక పోషించారని కొనియాడారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వాలు బాబు జగ్జీవన్ రావ్ గారికి భారతరత్న అవార్డును ప్రధానం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో MRPS ప్రకాశం జిల్లా కో- కన్వీనర్ మరియు ఉలవపాడు మండల ఇన్చార్జ్ చదలవాడ కిట్టు మాదిగ, MRPS ఉలవపాడు మండల ఇంచార్జ్ రావినూతల ఐజాక్ మాదిగ, కందుకూరు మండల ఇన్చార్జ్ వినయ్ మాదిగ, MEF సీనియర్ నాయకులు పున్నేపల్లి శీను మాదిగ, రాయపాటి శివ మాదిగ, రావినూతల రాజేష్ మాదిగ, మస్తాన్ మాదిగ, సురేంద్ర మాదిగ, రవి మాదిగ, ఏలియా మాదిగ, నగేష్ మాదిగ, కార్తీక్ మాదిగ, ప్రతాప్ మాదిగ తదితరులు పాల్గొన్నారు