
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
వేసవి కాలంలో ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశాల నేపథ్యంలో ప్రజలు వడగాల్పుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు సూచించారు. ఒంగోలు కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రజలకు అవగాహన కల్పించడం, చలివేంద్రాల ఏర్పాటు, త్రాగునీటి సరఫరా, వైద్య సదుపాయాల సిద్ధత తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ముఖ్యంగా మధ్యాహ్నం 12 నుండి 3 గంటల మధ్య అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా చిన్నపిల్లలు, గర్భిణీలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వడదెబ్బ నివారణకు ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని తెలిపారు.