
తొలి శుభోదయం సింగరాయకొండ :-
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంటపాడు పంచాయతీలో గత డిసెంబర్ నుండి భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిపి వేయడం జరిగింది . భూముల రిజిస్ట్రేషన్ ఆగిపోవడంతో
మూలగుంటపాడు గ్రామానికి చెందిన నరాల సుధాకర్ ఆధ్వర్యంలో మూలగుంటపాడు గ్రామానికి చెందిన నాయకులు, రైతులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు మరియు మారి టైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య ను కలిసి వారి సమస్యలు వివరించారు. వారి కృషి వలన మూలగుంటపాడు గ్రామంలో నిలిచి బోయిన రిజిస్ట్రేషన్ సమస్య పరిష్కారం సానుకూలంగా స్పందించి గ్రామస్తుల సమస్య కు ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ ఐఏఎస్ వారికి పరిష్కారం చూపారు.మూలగుంటపాడు గ్రామానికి చెందిన అన్ని సర్వే నెంబర్లకు రిజిస్ట్రేషన్ మొదలు పెట్టడానికి కావలసిన ఉత్తర్వులు జారీ చేశారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలుపెట్టడానికి ముఖ్య పాత్ర వహించిన సింగరాయకొండ మండల తహసీల్దారు వారికి మూలగుంటపాడు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపియున్నారు.
ఈ కార్యక్రమం నందు మూలగుంటపాడు గ్రామ పార్టీ అధ్యక్షుడు సన్నిబోయిన మల్లికార్జున , నరాల సుధాకర్, సన్నిబోయిన రమేష్, లక్ష్మణ్, శ్రీహరి, ఆర్ ఐ, వీఆర్వో , సర్వేయరు మరియు తదితరులు పాల్గొన్నారు.
