
తొలి శుభోదయం కందుకూరు:-
కందుకూరు నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడిగా ఇటీవల నియమితులైన, కందుకూరు మండలం ఓగూరు గ్రామానికి చెందిన అల్లం వెంకటేశ్వర్లు మంగళవారం కందుకూరులోని టిడిపి కార్యాలయంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ని మర్యాదపూర్వకంగా కలిశారు. తనను నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడిగా పనిచేసే అవకాశం కల్పించినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయనను శాలువాతో సత్కరించారు. నియోజకవర్గంలో రైతుల సమస్యలను తెలుసుకుని వారికి అండగా నిలవాలని అల్లం వెంకటేశ్వర్లుకు ఎమ్మెల్యే సూచించారు..ఈ కార్యక్రమంలో ఓగూరు తెలుగుదేశం పార్టీ నాయకులు చల్లా నాగేశ్వరరావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు భోగినేని వెంకటేశ్వర్లు, పార్టీ నాయకులు రాయపాటి శ్రీనివాసరావు, చల్లా కొండయ్య, పచ్చవ తిరుపతి స్వామి ఆండ్రా వెంకటేశ్వర్లు, ఏపూరి మనోహర్, పల్లె రఘు తానికొండ ప్రతాప్, దివి హరికృష్ణ, కొల్లూరి అశోక్ తొట్టెంపూడి సురేష్, చల్లా మహేంద్ర, చల్లా కళ్యాణ్, పొటికలపూడి వంశీ, భోగినేని సురేష్ పిటికీటి మాధవ చల్లా వెంకటేశ్వర్లు, దివి ప్రసాద్, దివి శ్రీకాంత్ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు..