
తొలి శుభోదయం న్యూస్ ఒంగోలు:-
ఒంగోలు నగరంలో గాంధీ పార్క్ రోడ్డు విస్తరణ పనులను పరిశీలించడం జరిగినది. గాంధీ పార్క్ నందు 50 లక్షలతో చేపట్టిన రోడ్డు విస్తరణ మరియు ఇతర అభివృద్ధి పనులు పరిశీలించడం జరిగినది. పార్క్ ఏదురుగా వున్న ది ఫ్యాన్సీ గూడ్స్ మార్చంట్ అసోసియేషన్ వారితో సమావేశం అవ్వడం జరిగినది , రోడ్డు విస్తరణకు సహకారం అందించాలి అన్ని వారితో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడటం జరిగినది. ఈ సందర్బంగా జనార్దన్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం.. అవినీతికి తావులేకుండా అధికార యంత్రాంగం పనిచేయాలని, ప్రజలు మెచ్చేలా పనులు చేసినప్పుడే ప్రభుత్వానికి, అధికారులకు మంచి పేరువస్తుందని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు తెలిపారు. అనుకున్న సమయానికంటే ముందే పూర్తి చేయాలని వారికి సూచించారు. నాణ్యతా ప్రమాణాలకు తగినట్గుగా పనులు జరిగేలా చూడాలని, నిర్లక్ష్యం, అవినీతికి చోటులేకుండా సకాలంలో అభివృద్ధిపనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని దామచర్ల అధికారుల్ని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ సంస్థ చైర్మన్ ముప్పువరపు సుచిత్ర , మార్కెట్ యార్డ్ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ , కమీషనర్ వెంకటేశ్వరావు , ఫాన్సీ గూడ్స్ అసోసియేషన్ అధ్యక్షులు చెంచయ్య గుప్తా ,నగర టీడీపీ అధ్యక్షులు బండారు మదన్ , టీడీపీ నాయకులు, అధికారులు మరియు తదితరులు పాల్గొన్నడం జరిగినది.