
తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ట్రాఫిక్ పోలీసులు, ఒంగోలు RTC బస్టాండ్ మరియు అద్దంకి బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో రోడ్డు ప్రయాణానికి అడ్డంకులు సృష్టిస్తున్న ఆటో డ్రైవర్లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. అనుమతి లేని విధంగా రోడ్డును ఆక్రమించడం, ప్రయాణికులకు మరియు వాహనదారులకు అసౌకర్యం కలిగించడం వంటి ఉల్లంఘనలపై సంబంధిత ఆటో డ్రైవర్లకు జరిమానాలు విధించారు.తరువాత వారికి ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు పట్ల బాధ్యత, స్టాండ్ వినియోగం, మరియు ప్రయాణికుల భద్రతపై అవగాహన కల్పించేలా కౌన్సెలింగ్ నిర్వహించారు. రోడ్డు అడ్డంకులు ప్రమాదాలకు దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులు సూచించారు.ఈ కార్యక్రమాన్ని ట్రాఫిక్ పోలీస్ RSI శివప్రసాద్ పర్యవేక్షించారు. ప్రజల భద్రత, రోడ్డు నియంత్రణను మెరుగుపరచేందుకు ఇటువంటి చర్యలు నిరంతరం కొనసాగుతాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.