
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కందుకూరులోని శ్రీ గాయత్రి ఒలింపియాడ్ మరియు శ్రీ గాయత్రి ఇ-టెక్నో పాఠశాలల ఆధ్వర్యంలో 'Femflare 2026' వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి.
ఉత్సాహభరితమైన క్రీడలు మరియు వేడుకలు: ఈ వేడుకల్లో భాగంగా విద్యార్థుల తల్లులకు మరియు పాఠశాల సిబ్బందికి ప్రత్యేక క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పాఠశాల యాజమాన్యం ఆహ్వానం మేరకు పెద్ద సంఖ్యలో హాజరైన తల్లులు, ఉపాధ్యాయులతో కలిసి వివిధ రకాల క్రీడల్లో పాల్గొని తమలోని క్రీడా స్ఫూర్తిని చాటారు.తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల మధ్య అనుబంధాన్ని పెంచేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించామని కళాశాల చైర్మన్ సీహెచ్ రామకృష్ణా రావు తెలియజేసారు మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వినోదభరితమైన మరియు క్రీడా పోటీలు అందరినీ అలరించాయి. విజేతలకు బహుమతులు అందజేయడంతో పాటు, పాల్గొన్న వారందరూ ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు.
మహిళల శక్తిని, సమాజంలో వారి ప్రాముఖ్యతను గౌరవిస్తూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం తమకు ఎంతో సంతోషాన్నిస్తోందని శ్రీ గాయత్రి విద్యాసంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు.