
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు పట్టణంలోని అన్న క్యాంటీన్లో ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్., ఉత్తరాంధ్ర జిల్లాల తెలుగుదేశం పార్టీ పరిశీలకులు, దామచర్ల సత్య( సత్యనారాయణ) జన్మదినోత్సవ వేడుకలు అట్టహాసంగా గురువారం జరిగాయి. తొలుత పొన్నలూరు తెలుగుదేశం పార్టీ బాధ్యులు, టీ. మహేంద్ర, సిహెచ్, శ్రీకాంత్, పొన్నలూరు మండల నాయకులు అన్న క్యాంటీన్ బాధ్యులు ఉన్నం కొండలరావు, బెజవాడ ప్రసాద్, ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. అనంతరం అన్న సేవా కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అన్న సేవ లో భాగంగా మిఠాయిలు, అరటి పండ్లు అందజేశారు. కార్యక్రమంలో అన్న క్యాంటీన్ పరిశీల కురాలు గుండవరపు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు