
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు పట్టణ అభివృద్ధికి మరో ముందడుగు పడింది. పట్టణంలో ఏర్పాటు చేసిన ఆధునిక సెంటర్ లైటింగ్ మరియు రోడ్డు డివైడర్లను కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పట్టణాన్ని మరింత అందంగా, సురక్షితంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని తెలిపారు. రాత్రి వేళల్లో ప్రయాణికులకు మెరుగైన వెలుతురు కల్పించడంతో పాటు, ట్రాఫిక్ ప్రమాదాలను తగ్గించేందుకు ఈ లైటింగ్ మరియు డివైడర్లు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.కందుకూరు పట్టణం అభివృద్ధి దిశగా సాగేందుకు ఎమ్మెల్యే నిరంతరం కృషి చేస్తున్నారని స్థానిక ప్రజలు అభినందించారు. ఆయన నాయకత్వంలో పట్టణం రోజురోజుకు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని నాయకులు, ప్రజలు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.