
భారీగా తరలివచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు…
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కందుకూరు పట్టణంలో ఆదివారం పండుగ వాతావరణంలో నిర్వహించారు. పట్టణ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ముఖ్యఅతిథిగా పాల్గొని పలుచోట్ల పార్టీ జెండాలను ఆవిష్కరించారు. జోహార్ ఎన్టీఆర్, తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి అనే నినాదాలతో కార్యకర్తలు హోరెత్తించారు. ముందుగా స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి నేతలతో కలిసి ఎమ్మెల్యే నాగేశ్వరరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అక్కడే మరో విగ్రహానికి పాలాభిషేకం చేశారు. పట్టణ మాజీ అధ్యక్షుడు పిడికిటి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన భారీ కేక్ ను ఎమ్మెల్యే కట్ చేసి నేతలకు తినిపించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పార్టీ శ్రేణులు అందరికీ ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు… పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం గుండంకట్ట రోడ్డు, 60 అడుగుల రోడ్డు జంక్షన్, పడమటి బలిజపాలెం, పోలేరమ్మ అరుగు, పొట్టి శ్రీరాములు విగ్రహం సెంటర్, అభ్యుదయ పాఠశాల, పోతురాజుమిట్ట ప్రాంతాలలో పార్టీ జెండాలను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. మధ్యలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, టంగుటూరి ప్రకాశం పంతులు, పూలే విగ్రహాలకు ఎమ్మెల్యే నాగేశ్వరరావు పూలమాలలువేసి నివాళులర్పించారు. మధ్యలో అంబేద్కర్ విగ్రహం వద్ద స్కందపురి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి, సేవా సమితి చైర్మన్ పువ్వాడి మౌనిక, ఇతర సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమాల్లో పార్లమెంటు ఉపాధ్యక్షులు ఉన్నం వీరాస్వామి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఉప్పుటూరి శ్రీనివాసరావు, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చిలకపాటి మధు, ఏపీఈడబ్ల్యూఐడి కార్పొరేషన్ డైరెక్టర్ పోకూరి రాంబాబు, పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ సలాం, రాష్ట్ర ముస్లిం మైనారిటీ సెల్ అధికార ప్రతినిధి షేక్ రఫీ, రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి బెజవాడ ప్రసాద్, పార్లమెంట్ అధికార ప్రతినిధి చదలవాడ కొండయ్య, పార్లమెంట్ కార్యనిర్వాహ కార్యదర్శి షేక్ రూబీ, నియోజకవర్గం బీసీ సెల్ అధ్యక్షుడు ముచ్చు శ్రీను, నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షుడు షేక్ మున్నా, నియోజకవర్గ తెలుగుమహిళా అధ్యక్షురాలు కల్లూరి శైలజ, పట్టణ మహిళా అధ్యక్షురాలు ముచ్చు లక్ష్మీరాజ్యం, వార్డు అధ్యక్షులు మధిర మధు, చల్లా మహేంద్ర, సిగా శ్రీను, షేక్ నజీర్, మోసంగి ప్రసాద్, పరిటాల రామకృష్ణ, అన్ని వార్డుల అధ్యక్షులు, పార్టీ సీనియర్ నేతలు, అనుబంధ సంఘాల కమిటీల సభ్యులు పాల్గొన్నారు.