
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు తహసీల్దార్ గా పి. మురళీ సోమవారం బాధ్యతలు చేపట్టారు. జరుగుమల్లి తహసీల్దార్ గా పనిచేస్తూ బదిలీ మీద ఇక్కడికి రావటం జరిగింది. ఈయన 2018 గ్రూప్ 2 బ్యాచ్ కి చెందినవారు. గతంలో ఒంగోలు, కొండపి మండలాల్లో తహసీల్దార్ గా విధులు నిర్వర్తించారు. భూమి సమస్యలు ముఖ్యంగా రీసర్వే అనంతరం వచ్చిన సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తాననీ, ప్రజల్లో సానుకూల దృక్పథం పెంచేలా పనిచేస్తామని తెలిపారు.