
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు సమీపంలోని కొండముడుసుపాలెం జంక్షన్ పడమరవైపు… జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. జామాయిల్ కర్ర తాట తీసే వాహనం నిలిపి ఉండగా, వెనకనుంచి కారు ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న చాంద్ బాషా అనే వ్యక్తి స్పాట్ లో చనిపోయాడు. ఆదిశేషారెడ్డి వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో ఒంగోలు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. చనిపోయిన వ్యక్తి సొంతూరు పామూరు దగ్గర గోపాలపురం. ఇద్దరూ కనిగిరి సొసైటీ బ్యాంకులో ఉద్యోగులుగా తెలుస్తోంది. వీరిద్దరూ ఒంగోలు నుంచి పామూరు వెళుతూ ప్రమాదానికి గురయ్యారు.