
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు పట్టణంలోని పంచాయతీరాజ్ కార్యాలయం వద్ద మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా ప్రయాణికులు దాహార్తిని తీర్చుకునేందుకు మరిన్ని చలివేంద్రాలను పట్టణవ్యాప్తంగా ఏర్పాటు చేయాలని అధికారులకు ఈ సందర్భంగా సూచించాను. అనంతరం మన ప్రియతమ నేత, ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వేడుకలను అన్న క్యాంటీన్ వద్ద పార్టీ శ్రేణులతో కలిసి ఘనంగా నిర్వహించాము. బాబు గారి జన్మదినం సందర్భంగా పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ ట్రస్ట్‌కు నా వంతుగా రూ. 76,000/- విరాళాన్ని అందజేశాను. చంద్రబాబు గారి పుట్టినరోజున రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరికీ అన్న క్యాంటీన్లలో ఉచితంగా భోజనం అందించేందుకు శ్రీమతి నారా భువనేశ్వరి గారు రూ. 76 లక్షలు ట్రస్ట్‌కు అందజేయడం మనందరికీ స్ఫూర్తిదాయకం. ఈ క్రమంలోనే నేను స్వయంగా అన్న క్యాంటీన్ వద్ద పేదలకు భోజనం వడ్డించి, ఆహార నాణ్యతపై వారిని అడిగి తెలుసుకున్నాను. ప్రజలతో మమేకమై వారితో కలిసి భోజనం చేయడం సంతృప్తిని ఇచ్చింది. ప్రజల సేవలో ఉండటమే మా లక్ష్యం
