
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు పట్టణంలో నిర్వహించిన "స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర" కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీకి ప్రధాన తాగునీటి వనరు అయిన రామతీర్థం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించాను. పంప్ హౌస్‌ను సందర్శించి నీటిని ఫిల్టర్ చేసే విధానాన్ని నిశితంగా గమనించడమే కాకుండా, ట్యాంక్ చుట్టూ పేరుకుపోయిన జమ్ము మరియు ఇతర వ్యర్థాలను తొలగిస్తున్న పనులను అధికారులతో కలిసి పర్యవేక్షించాను. ఈ సందర్భంగా అందరం కలిసి స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేసి, పర్యావరణ పరిరక్షణ పట్ల మన నిబద్ధతను చాటుకున్నాం.
పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రాధాన్యత అని, ఇందులో భాగంగా భూగర్భ జలాల పెంపుదల మరియు నీటి వనరుల సద్వినియోగంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కోరుతున్నాను. జలాశయాల్లో గుర్రపుడెక్కను కేవలం వ్యర్థంగా పారేయకుండా, దాని ద్వారా సేంద్రియ ఎరువులు మరియు ఉపయోగకరమైన వస్తువుల తయారీపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించాను. మన పర్యావరణాన్ని కాపాడుకుంటూ, భావితరాలకు సురక్షితమైన వనరులను అందించేందుకు ప్రతి పౌరుడు ఈ స్వచ్ఛతా యజ్ఞంలో భాగస్వాములు కావాలని పిలుపునిస్తున్నాను.