
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు మున్సిపాలిటీకి తాగునీటిని అందించే రామతీర్థం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ను అధికారులు, నేతలతో కలిసి ఎమ్మెల్యే నాగేశ్వరరావు పరిశీలించారు. పంప్ హౌస్ కు వెళ్లి, నీటిని ఫిల్టర్ చేసే విధానాన్ని గమనించారు.
సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ చుట్టూ వాతావరణన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు… జమ్ము, ఇతర వ్యర్ధాలు తొలగిస్తున్న పనులను ఎమ్మెల్యే నాగేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా, అధికారులు నేతలతో కలిసి స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేశారు.
పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడం మరియు పర్యావరణ నిర్మాణమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని ఎమ్మెల్యే నాగేశ్వరరావు తెలిపారు. భూగర్భ జలాలను పెంచడం, నీటివనరులను సద్వినియోగం చేసుకోవడంపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలన్నారు.
అలాగే చెరువులు, కుంటలకు నీరు వచ్చే కాలువలలో గుర్రపుడెక్క, చెత్త తొలగించే కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. గుర్రపు డెక్క వృధాగా పారేయకుండా, దాంతో సేంద్రియ ఎరువులు, ఇతర ఉపయోగకరమైన వస్తువులు తయారు చేసుకునే విధానాన్ని ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యే నాగేశ్వరరావు అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అనూష, డిఈ గణపతి, పట్టణ టిడిపి అధ్యక్షుడు మల్లేశ్వరరావు, నెల్లూరు పార్లమెంటు ఉపాధ్యక్షులు ఉన్నం వీరాస్వామి, ఏపీఈడబ్ల్యుఐడీ కార్పొరేషన్ డైరెక్టర్ పోకూరి రాంబాబు, రాష్ట్ర ముస్లిం మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి షేక్ రఫీ, నెల్లూరు పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ రూబీ, నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు అల్లం వెంకటేశ్వర్లు, ఉప్పుటూరి శ్రీను, నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షుడు షేక్ మున్నా, క్లస్టర్ ఇంచార్జ్ వడ్డెళ్ళ రవిచంద్ర, పార్టీ నేతలు కూనం నరేంద్ర, ముచ్చు వేణు, పువ్వాడి కోటయ్య, చుండూరి శ్రీను, రాయపాటి శ్రీను, యర్రా ముసలయ్య, పువ్వాడ మురళి, గడ్డం మాలకొండయ్య, భవనాసి వెంకటేశ్వర్లు, గుర్రం మధు, నియోజవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు కల్లూరి శైలజ, నియోజకవర్గ తెలుగు ప్రొఫెషనల్ వింగ్ అధ్యక్షురాలు పువ్వాడి మౌనిక, పార్వతి, అశ్విని, నల్లూరి సూర్యనారాయణ, నాదెండ్ల మధు, షేక్ కాలేశా, మమ్ముషా, ఫణీంద్ర తదితరులు పాల్గొన్నారు.