
తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
కంభం పట్టణంలోని నివాస ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించే ప్రసక్తే లేదని కంభం పోలీసులు మరోసారి నిరూపించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, కంభం ఎస్సై శివ కృష్ణారెడ్డి గారు మరియు వారి సిబ్బంది స్థానిక 'హ్యాపీ రెసిడెన్సీ' (Happy Residency) లో సాగుతున్న పేకాట శిబిరంపై ఆకస్మిక దాడి నిర్వహించారు.ఈ దాడుల్లో ఐదుగురు వ్యక్తులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న పోలీసులు, వారి వద్ద నుండి ₹6,060/- నగదును మరియు పేకాట ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. నివాస సముదాయాల్లో మరియు అపార్ట్మెంట్లలో నిబంధనలకు విరుద్ధంగా జూదం, పేకాట వంటి అసాంఘిక పనులకు పాల్పడితే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని, ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. పట్టుబడిన ఐదుగురిపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టారు.