
తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, కనిగిరి ఎస్డీపీఓ కార్యాలయంలో కనిగిరి డీఎస్పీ నెలవారీ నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కనిగిరి ఉపవిభాగ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లకు సంబంధించిన యూఐ (UI) మరియు సీడీ (CD) ఫైళ్లను సమగ్రంగా పరిశీలించారు.పెండింగ్ కేసుల పురోగతి, దర్యాప్తు నాణ్యత, ఆధారాల సేకరణ, చట్టపరమైన విధానాల అమలు వంటి అంశాలపై విస్తృతంగా సమీక్షించారు. దర్యాప్తును మరింత వేగవంతం చేసి, కేసులను సకాలంలో పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు జారీ చేశారు.ప్రజలకు న్యాయం త్వరగా అందేలా దర్యాప్తు పారదర్శకంగా, సమర్థవంతంగా జరగాలని డీఎస్పీ ఆదేశించారు. విధుల్లో ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా, ప్రతి కేసు పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను సూచించారు.