
తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:-
కనిగిరి ఏపీ ఆదర్శ పాఠశాల నందు పదవ తరగతి విద్యార్థుల కొరకు సరస్వతీ పూజ అనంతరం ఘనంగా వీడ్కోలు సభను నిర్వహించారు. కాంట్రాక్టర్ కృష్ణారెడ్డి పరీక్షకు అవసరమైన అట్టలను బహుకరించగా పాఠశాల నందు చదివిన గుర్తుగా నవీన వాసంతి వారి తండ్రి ఆంధ్ర శ్రీను పెన్నులను విద్యార్థులకు అందించి తమ దాతృత్వం చాటుకున్నారు
కార్యక్రమంలో భాగంగాజన విజ్ఞాన వేదిక నాయకులు గయాజ్ చే చదువు యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఏర్పాటుచేసిన మోటివేషన్ స్పీచ్ విద్యార్థులను ఎంతగానో ఆలోచింపజేసింది.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తులసీ పద్మావతమ్మ మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించడానికి అవసరమైన నైపుణ్యాలను చక్కగా వినియోగించుకొని ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని కోరుతూ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో.పాల్గొన్నటువంటి తల్లితండ్రులు కమిటీ చైర్మన్ పందిటి మోహన్ ఏపీ మోడల్ స్కూల్ ప్రారంభం నుండి మండల స్థాయిలోనూ,జిల్లా స్థాయిలోనూ కార్పొరేట్ పాఠశాలకు దీటుగా నిలుస్తున్నదని ఈ ఫలితాల సాధనకు కృషి చేస్తున్న ఉపాధ్యాయిని,ఉపాధ్యాయులకు తల్లితండ్రుల కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేశారు ఈ క్రమంలో కాంట్రాక్టర్ కృష్ణారెడ్డిని 2000 లీటర్ల విద్యార్థులు తాగేందుకు వీలుగా స్టీల్ వాటర్ ట్యాంకును అడగగా వారు అందజేస్తామని తెలిపారు అడగగానే ఫ్యాడ్స్, పెన్నులు అందజేసిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు తన తమ అనుభవాలను పంచుకోవడంతో పాటుగా వివిధ నృత్యాలతో అందరిని అలరించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థినీ,విద్యార్థులతో పాటుగా ఇతర ఉపాధ్యాయులు కూడా పాల్గొని సభను విజయవంతం చేశారు
