
తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ,కనిగిరి పట్టణంలోని MSR కాలేజీలో మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో శక్తి యాప్ ఉపయోగం, అత్యవసర పరిస్థితుల్లో మహిళలకు అందుబాటులో ఉండే పోలీసు సహాయ సేవలు, మహిళల భద్రతకు సంబంధించిన చట్టాలు, మరియు నేరాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విద్యార్థినులకు విపులంగా వివరించారు.వెల్లిగండ్ల పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ G. కృష్ణ పావని విద్యార్థులతో ముఖాముఖి చర్చిస్తూ, ప్రతి మహిళా తన భద్రత కోసం శక్తి యాప్ను తప్పనిసరిగా ఉపయోగించాలని సూచించారు. ప్రమాదకర పరిస్థితుల్లో పోలీసుల సహాయం కేవలం ఒక క్లిక్ దూరంలో ఉంటుందని తెలియజేశారు.ప్రకాశం జిల్లా పోలీసులు మహిళల భద్రత, రక్షణ, శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తూ, ఇలాంటి అవగాహన కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు.
