
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
ప్రకాశం కలెక్టర్ పి.రాజాబాబు , జాయింట్ కలెక్టర్ కల్పన కుమారి తో… కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఈ సాయంత్రం భేటీ అయ్యారు. కందుకూరు నియోజకవర్గంలో రెవెన్యూ సిబ్బంది తగినంతమంది లేరని, వీఆర్వో సహా పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఎమ్మెల్యే వారి దృష్టికి తీసుకువెళ్లారు. ఆ కారణంగా రెవిన్యూ సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతోందని చెప్పారు. ముఖ్యంగా భూములకు సంబంధించి అనేక ఫైల్స్ పెండింగ్ లో ఉన్నాయని వివరించారు. వీలైనంత త్వరగా రెవిన్యూ శాఖలో ఖాళీలు భర్తీచేయాలని ఎమ్మెల్యే నాగేశ్వరరావు కోరారు. ఇంకా నియోజవర్గంలో పలు అభివృద్ధి పనుల గురించి వారితో చర్చించారు. కందుకూరు సబ్ కలెక్టర్ దామెర హిమవంశీ కూడా చర్చల్లో పాల్గొన్నారు.