
మేడే సందర్భంగా మండల న్యాయ సేవాధికారి సంఘం ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు.
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం
మేడే సందర్భంగా కందుకూరు మండల న్యాయ సేవ అధికారసంఘం ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏపీ. పిటిడి యూనియన్ కందుకూరు డిపో ఆఫీసులో జరిగినది. ఈ సందర్భంగా న్యాయ సేవాధికార సంఘం తరఫున హాజరైన న్యాయవాదులు ముప్పవరపు. కిషోర్, షేక్.జమీర్ మాట్లాడుతూ కష్టించి పనిచేసే కార్మికులందరికీ అంతర్జాతీయ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు. మండల న్యాయ సేవాధికారి సంఘం తరఫున కార్మికుల హక్కులు, విధులు, బాధ్యతలు, సంక్షేమానికి ( వెల్ఫేర్) సంబంధించిన చట్టాల పైన అవగాహన,చైతన్యం కల్పించడం జరుగుతుందని అవుట్సోర్సింగ్, కాంటాక్ట్ లేబర్ లకు కూడా ఉచిత న్యాయాన్ని అందించడం జరుగుతుందని తెలిపారు. కార్మికులు అందరూ కార్మిక చట్టాల పైన విధిగా అవగాహన కలిగి ఉండాలని ఈ సందర్భంగా తెలిపారు. భారత రాజ్యాంగం కల్పించిన కార్మికచట్టాల పట్ల అవగాహనతో పాటు అమలు చేసే దానికి తగిన చర్యలు న్యాయ సేవాధికారి సంఘం తీసుకుంటుందని తెలియజేశారు. మహిళ కార్మికులకు ప్రత్యేకమైన లేబర్ చట్టాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏ.పీ పిటీడీ యూనియన్ కందుకూరు డిపో నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.