
తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
సింగరాయకొండమండలంలోని బిట్రగుంటలో కొలువు తీరి ఉన్న శ్రీ కాల భైరవఆలయంలో
మంగళవారం పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు, హోంమాలను నిర్వహించారు. తమ మొక్కుబడులను చెల్లించి గుమ్మడికాయలనువెలిగించి భక్తిశ్రద్ధలను చాటుకున్నారు. ఒంగోలు ,నెల్లూరు తదితర జిల్లాలనుంచి వేలాదిమంది భక్తులు విశేషంగా తరలివచ్చారు. ఆలయ కమిటీ నిర్వాహకులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడుపర్యవేక్షించా
రు. భక్తులకు వసతులను కల్పిస్తూ సేవకులను నియమించి అన్నదాన కార్యక్రమoకు భక్తులు హాజరయ్యారు. జాతీయ రహదారీపైనే ఆటోలు, కార్లు, తదితర వాహనాలను నిలిపేశారు. సింగరాయకొండ సిఐ చావా హజరత్తయ్య ఆధ్వర్యంలో సిబ్బంది ఎలాంటి ఇబ్బందులను లేకుండా రాకపోకలు వెళ్లే విధముగా చర్యలను చేపట్టారు.