
తొలి శుభోదయం ప్రకాశం:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, విద్యార్థుల్లో చట్ట అవగాహన, సామాజిక బాధ్యత మరియు సృజనాత్మక ఆలోచనలను పెంపొందించడానికి భాగంగా కురిచేడు మండలంలోని KGBV పాఠశాలలో వ్యాస రచన (ఎస్సే రైటింగ్) పోటీలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పోలీసులు విద్యార్థులకు చట్ట పరిరక్షణ, మహిళా భద్రత, సైబర్ అవగాహన వంటి అంశాలపై సరైన సమాచారం అందించారు. విద్యార్థులు సమాజంలో బాధ్యతాయుతంగా వ్యవహరించేలా మార్గదర్శకాలు కూడా ఇచ్చారు. పోటీల్లో పాల్గొన్న విజేతలకు ప్రోత్సాహక బహుమతులు కూడా అందజేశారు.
ప్రకాశం జిల్లా పోలీసులు ఇలాంటివి మరిన్ని అవగాహన కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు.