
తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు పట్టణంలో మాలకొండయ్య డాక్టర్ పేరుగాంచిన ధన్యాసి మాలకొండయ్య ఈరోజు ఉదయం వృద్ధాప్యం కారణంగా మృతి చెందారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. ఆయన 50 సంవత్సరాలుగా కందుకూరు పట్టణంలో ప్రగతి నర్సింగ్ హోమ్ స్థాపించి ఎంతోమంది పేద ప్రజలకు వైద్య సేవలు అందించారు. అంతేకాకుండా కొండపిసమితి మొట్టమొదటి అధ్యక్షుడిగా దివి కొండయ్య చౌదరి ఆశీర్వాదంతో గెలుపొంది ప్రజలకు సేవలందించారు. ఆయన మృతికి కందుకూరు ప్రముఖులు డాక్టర్లు రాజకీయ నాయకులు ప్రజలు తమ సంతాపాన్ని తెలియజేశారు. వారికి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు. కందుకూరులో ప్రముఖ డాక్టర్ గా పేరుగాంచిన ధన్యాసి శ్రీనివాసన్ ఆయన రెండవ కుమారుడు.